జుమేరా షాపింగ్ కాంప్లెక్స్‌లోని స్టోర్‌లోకి దూసుకెళ్లిన SUV..!!

- September 02, 2025 , by Maagulf
జుమేరా షాపింగ్ కాంప్లెక్స్‌లోని స్టోర్‌లోకి దూసుకెళ్లిన SUV..!!

దుబాయ్: దుబాయ్‌లోని ఉమ్ సుకీమ్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లోని స్టోర్‌లోకి ఒక ఎస్ యూవీ దూసుకెళ్లింది. జుమేరాలోని స్పిన్నీస్ భవనంలోని ముముసో స్టోర్‌లోకి SUV దూసుకెళ్లిన ఘటన ఆదివారం (ఆగస్టు 31) మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పగిలిపోయిన గాజు మరియు విరిగిన కిటికీ అద్దాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

ఈ సంఘటనలో ఎవరికీ తీవ్రమైన గాయాలు కాకపోవడంతో స్పిన్నీస్ తన కమ్యూనిటీ సెంటర్‌లో “భద్రతా సమీక్ష” నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ సంఘటన నేపథ్యంలో అదనపు భద్రతా చర్యలను గుర్తించడానికి కమ్యూనిటీ సెంటర్ భద్రతా సమీక్షను నిర్వహించినట్టు తెలిపింది.  ప్రమాదానికి గల కారణాన్ని సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారని స్పిన్నీస్ వెల్లడించింది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com