బహ్రెయిన్ లో ఎలక్ట్రానిక్ పార్శిల్ లాకర్లు ప్రారంభం..!!
- September 02, 2025
మనామా: బహ్రెయిన్ పోస్ట్ ఆధ్వర్యంలో కొత్త ఎలక్ట్రానిక్ లాకర్ సర్వీసును రవాణా మరియు టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఇది పోస్టల్ సేవలను ఆధునీకరించడంతోపాటు వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తుందని మంత్రిత్వ శాఖలోని భూ రవాణా మరియు పోస్టల్ సేవల అండర్ సెక్రటరీ ఫాతిమా అబ్దుల్లా అల్-దాఆన్ తెలిపారు. వ్యక్తులు మరియు వ్యాపారాల అవసరాలను తీర్చడానికి పార్శిల్ సేకరణ కోసం లాకర్లు ఆచరణాత్మకమైన ఎంపికలను అందిస్తాయని చెప్పారు.
ఎలక్ట్రానిక్ లాకర్లు కస్టమర్లు నిర్దిష్ట సమయాలకు లేదా పోస్టాఫీసులను సందర్శించకుండా సురక్షితంగా మరియు వారి సౌలభ్యం మేరకు పార్శిల్లను స్వీకరించడానికి అనుమతిస్తాయని అల్-దాఆన్ వివరించారు. కస్టమర్లు ప్రత్యేకమైన కోడ్ మరియు లాకర్ స్థానాన్ని అందుకుంటారని, అదే కోడ్‌ని ఉపయోగించి పార్శిల్‌ను సేకరించవచ్చన్నారు. లాకర్లను వ్యూహాత్మకంగా ప్రధాన వాణిజ్య కేంద్రాలలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం సీఫ్ మాల్, మారస్సీ గల్లెరియా, ది అవెన్యూస్, సౌక్ అల్-బర్రాహా, డ్రాగన్ సిటీ మరియు సార్ మాల్ లో అందుబాటులో ఉంటాయన్నారు. త్వరలో మరిన్ని ప్రదేశాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







