న్యూయార్క్‌లో క్రౌన్ ప్రిన్స్, మాక్రాన్ భేటీ..!!

- September 03, 2025 , by Maagulf
న్యూయార్క్‌లో క్రౌన్ ప్రిన్స్, మాక్రాన్ భేటీ..!!

మనామా:  సెప్టెంబర్ 22న న్యూయార్క్‌లో జరిగే టూ స్టేట్ సొల్యుషన్ కాన్ఫరెన్స్ కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌ అధ్యక్షత వహించనున్నారు. ఈ మేరకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలియజేశారు. 

పాలస్తీనా అధికారులకు వీసాలు నిరాకరించడానికి వాషింగ్టన్ తీసుకున్న చర్యను మాక్రాన్ విమర్శించారు.  దీనిని "ఆమోదయోగ్యం కాదు" అని మరియు పాలస్తీనా భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి UN హోస్ట్ కంట్రీ ఒప్పందానికి అనుగుణంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

టూ స్టేట్ పరిష్కారానికి విస్తృత అంతర్జాతీయ మద్దతు కావాలని, దాంతోనే ఇజ్రాయెల్ మరియు పాలస్తీనియన్ సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుందన్నారు.  అంతకుముందు దీనిని సాధించడానికి శాశ్వత కాల్పుల విరమణ, బందీల విడుదల, గాజాకు పెద్ద ఎత్తున మానవతా సహాయం అందించడం మరియు స్థిరీకరణ మిషన్‌ను మోహరించడం అవసరమని ఆయన అన్నారు.

హమాస్‌ను నిరాయుధీకరించి పాలన నుండి మినహాయించాలని, పాలస్తీనా అథారిటీని సంస్కరించి బలోపేతం చేయాలని మరియు గాజాను పూర్తిగా పునర్నిర్మించాలని, నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మాక్రాన్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com