‘రాజాసాబ్’ ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది..

- September 09, 2025 , by Maagulf
‘రాజాసాబ్’ ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది..

 ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ మొదటిసారి హారర్ కామెడీ జానర్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ట్రైలర్ కూడా రిలీజ్ చేసి హైప్ పెంచారు. అయితే ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఇప్పుడు సంక్రాంతికి వస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్ నిర్మాణంలో మారుతీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తేజ సజ్జా మిరాయ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత విశ్వ ప్రసాద్ నేడు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో రాజాసాబ్ సినిమా అప్డేట్ గురించి తెలిపారు.

విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. రాజాసాబ్ మొదటి పాట ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23న వస్తుంది. అలాగే థియేటరికల్ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేస్తాం. ఆ ట్రైలర్ కాంతార చాప్టర్ 1 సినిమాతో అక్టోబర్ 2 నుంచి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అని తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ట్రైలర్, సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com