మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!

- September 10, 2025 , by Maagulf
మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!

దోహా: ఖతార్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు 100 శాతం డిజిటలైజేషన్‌ను సాధించే దిశగా ఖతార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 2030 వరకు 20 శాతం వార్షిక వృద్ధి రేటుతో పేటెంట్ల సంఖ్యను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వెల్లడించింది. ఈ సందర్భంగా మేధో హక్కులను ఎలా రక్షించుకోవాలో అవగాహనను కల్పిస్తుంది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ చేసింది.

పేటెంట్ దరఖాస్తును దాఖలు చేయడం వల్ల తమ ఆవిష్కరణలకు చట్టపరమైన హక్కు లభిస్తుందని, ఆతర్వాత దానిని తమ అనుమతి లేకుండా ఇతరులు దానిని ఉపయోగించకుండా నిరోధిస్తుందని పేర్కొంది.  వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ లో ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ సర్వీసును యాక్సెస్ చేయడానికి అవసరమైన దశలవారిగా గైడెన్స్ ఉందని తెలిపింది. 

ఈ విషయంలో మంత్రిత్వ శాఖలోని మేధో సంపత్తి హక్కుల రక్షణ విభాగం అవసరమైన సహాయం అందజేస్తుందన్నారు.  ట్రేడ్‌మార్క్‌లు, కాపీరైట్, రిజిస్టర్డ్ డిజైన్‌లు మరియు పేటెంట్‌లకు సంబంధించి కొత్త చట్టాలు 2002 నుండి అమలులో ఉన్నాయని తెలిపింది.       

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com