కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!

- September 10, 2025 , by Maagulf
కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!

యూఏఈ: దుబాయ్ వ్యాపారవేత్త అనిస్ సాజన్ 700 కి పైగా అసియా కప్ మ్యాచులకు సంబంధించిన టిక్కెట్లను బ్లూ-కాలర్ కార్మికులకు ఉచితంగా అందజేశారు. సెప్టెంబర్ 9న ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, బంగ్లాదేశ్, ఒమన్ మరియు శ్రీలంక జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

"భారత్ vs పాకిస్తాన్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ కోసం 100 టిక్కెట్లను పక్కన పెట్టాము. దీంతోపాటు, సూపర్ 4 స్టేజ్ (21న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే) కోసం 100 టిక్కెట్లను మరియు ఫైనల్స్ కోసం మరో 100 టిక్కెట్లను రిజర్వ్ చేసుకున్నాము" అని డానుబే గ్రూప్ వైస్ చైర్మన్ సాజన్ అన్నారు.చాలా మంది కార్మికులకు, తమ క్రికెట్ హీరోలను ప్రత్యక్షంగా చూడటానికి అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

డానుబే గ్రూప్ కంపెనీలలో వివిధ దేశాలకు చెందిన 2,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. లక్కీ డ్రా నిర్వహించి టిక్కెట్లను అందజేసినట్లు వెల్లడించారు. మ్యాచ్‌లకు హాజరయ్యే కార్మికులకు ఆరోజు పెయిడ్ హాలిడే ఇస్తున్నట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com