షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- September 11, 2025
దుబాయ్: షేక్ జాయెద్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును ఢీకొట్టి ఒక మోటార్ సైక్లిస్ట్ మృతి చెందాడని దుబాయ్ పోలీసులు తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా ట్రక్కు ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మోటార్ సైకిల్ అదుపు తప్పి, నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టినట్టు వివరించారు. అబుదాబి వైపు వెళ్తున్న అరేబియన్ రాంచెస్ బ్రిడ్జీ ముందు ఈ ప్రమాదం జరిగినట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా బిన్ సువైదాన్ తెలిపారు. హార్డ్ షోల్డర్పై అనవసరంగా వాహనాలను ఆపడం అత్యంత ప్రమాదకరమైన ట్రాఫిక్ నేరాలలో ఒకటి అని, ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని బ్రిగేడియర్ బిన్ సువైదాన్ చెప్పారు.
దుబాయ్లో ఇది తీవ్రమైన ట్రాఫిక్ నేరమన్న ఆయన, దీనికి వేల దిర్హామ్ల జరిమానాలు, బ్లాక్ పాయింట్లతోపాటు వాహనాన్ని సీజ్ చేస్తారని హెచ్చరించారు. వాహనదారులు సురక్షితమైన దూరాన్ని మెయింటన్ చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను తప్పించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ముఖ్యంగా అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో చట్టపరమైన వేగ పరిమితులను పాటించాలని, అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని డ్రైవర్లకు సూచించారు.
తాజా వార్తలు
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో
- నేపాల్: మళ్లీ కోలుకోవడం కష్టమే!
- భారతీయులకు వీసాలు ఇవ్వొద్దు: చార్లీ కిర్క్