భారతీయులకు వీసాలు ఇవ్వొద్దు: చార్లీ కిర్క్
- September 11, 2025
అమెరికా: అమెరికాకు చెందిన కన్జర్వేటివ్ నాయకుడు చార్లీ కిర్క్ ఉటాలో జరిగిన దాడిలో దుర్మరణం చెందారు. కిర్క్ ఉటా వ్యాలీ యూనివర్శిటీ,కార్యక్రమంలో మాట్లాడుతుండగా, ఓ దుండగుడు ఆయనపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో చార్లీ కిర్క్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనేఆయన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు కిర్క్ చనిపోయినట్లు ట్రంప్ ధ్రువీకరించారు.
అయితే ఈ హత్యకు వారం రోజుల ముందే కిర్క్ భారతీయులకు వీసాల విషయంలో చేసిన కామెంట్లు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా వలసలు, ఔట్సోర్సింగ్ వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని ఆయన ఆరోపించారు. భారతీయులకు వీసా (Visa) లు ఇవ్వడం ఆపేయాలని కూడా డిమాండ్ చేశారు. కిర్క్ మరణం తర్వాత ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక చాలు. మనదేశం నిండిపోయింది. మన ప్రజలకే ప్రాధాన్యత ఇద్దాం’ అని కిర్క్ కామెంట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు ముఖ్య సహాయకుడిగా ఉన్న 32 ఏళ్ల కిర్క్ సెప్టెంబర్ 2న ‘అమెరికా ఫస్ట్’ అనే చర్చల్లో పాల్గొన్నారు.
ఇందులో భాగంగానే అమెరికా,భారతీయులకు వీసాలు ఇవ్వడం ఆపేయాలని ఆయన గట్టిగా వాదించారు. ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ ‘అన్ని దేశాల వలస కార్మికుల కంటే కూడా భారతీయుల వల్లే అమెరికన్లకు పెద్దగా ఉద్యోగావకాశాలు ఉండడం లేదని ఆరోపించారు.
అమెరికా భారతీయులకు మరింత వీసాలు ఇవ్వాల్సి వస్తుందని ఫాక్స్ న్యూస్ యాంకర్ చేసిన ఎక్స్ పోస్టుపై కిర్క్ ఈ విధంగా స్పందించారు. ఈఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వాటిలో కిర్క్ కుర్చీలో నుంచి పడిపోతూ
తన మెడను పట్టుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో