నేపాల్: మళ్లీ కోలుకోవడం కష్టమే!
- September 11, 2025
నేపాల్ యువత తిరుగుబాటు చేసింది. కఠ్మాండూలో అరాచకం జరిగింది. అది చిన్న అరాచకం కాదు. వాళ్లూ.. వీళ్లూ అనే తేడా లేకుండా… రాజకీయ నేతలందరిపై దాడులు చేశారు. ఓ మాజీ ప్రధాని భార్యను సజీవదహనం చేశారు. తమ దేశ ప్రజాస్వామ్య చిహ్నమైన పార్లమెంట్ ను కూడా వదిలిపెట్టలేదు. ఇళ్లను, పార్లమెంట్ ను.. తగులబెట్టేశారు. ఇది నేపాల్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన తిరుగుబాటు విధ్వంసం.
అందరూ వైదొలిగిన తర్వాత కూడా హింస!
ప్రజా తిరుగుబాటు తీవ్రమైందని తెలుసుకున్న తర్వాత పాలకులందరూ పదవుల నుంచి దిగిపోయారు. అన్నీ ఖాళీ చేసి పారిపోయారు. వారిని కాపాడేందుకు ఆర్మీ తంటాలు పడింది. కనిపిస్తే వారిలో చాలా మందిని చంపేసి ఉండేవారు. ఆర్మీ హెలికాఫ్టర్లు తాళ్లు విసిరితే..ఆ తాళ్లు పట్టుకుని పారిపోయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వాలు కుప్పకూలిన తర్వాత చేసే అరాచకం ఏదైనా ఆ దేశానికే నష్టం తెస్తుంది. నేపాల్ లో అదే జరుగుతోంది.
అసలే పేద దేశం.. మొత్తం విధ్వంసం!
నేపాల్ అసలే పేద దేశం. తినే ఆహారం కోసం కూడా దిగుమతులపైనే ఆధారపడాలి. పర్యాటకంపై ఎక్కువ ఆధారపడి ఉంటారు. అలాంటి దేశంలో యువత తిరుగుబాటు అనేది..తమ దేశానికి.. తమకు దీర్ఘకాలికంగా నష్టం లేకుండా చేసుకోవాలి. కానీ నేపాల్ యువత అరాచకానికే మొగ్గు చూపారు. తమ దేశ మౌలిక సదుపాయాల్ని ద్వంసం చేసుకున్నారు. పార్లమెంట్ ను ధ్వంసం చేసుకుని వారు సాధించేదేమిటో. వారికే తెలియాలి. ఇప్పుడు ఇతర దేశాలు నేపాల్ యువత చేసిన విధ్వంసాన్ని భర్తీ చేయవు. మళ్లీ అక్కడి ప్రజలే వాటిని తమ డబ్బులతో నిర్మించుకోవాలి.
ఆర్మీ కాల్పులతోనే అసలు సమస్య
అవినీతి, ఇతర ప్రభుత్వ వ్యవహారాలపై అసంతృప్తి సహజంగానే ఉంటుంది. కానీ సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో ప్రజలు రగిలిపోయారు. వారిని కట్టడి చేయడానికి బెదిరించాలనుకున్నారు. అది కాల్పులకు దారి తీయడంతో చివరికి పూర్తిగా పరిస్థితి విషమించింది. ఇప్పుడు ఆ దేశానికి జరిగిన నష్టం ఆస్తుల రూపంలోనే కాదు.. అనేక విధాలుగా ఉంటుంది. పర్యాటకులు కూడా వెళ్లరు. అప్పుడు అక్కడి యువత మరిన్ని ఇబ్బందులు పడుతుంది. ప్రజలకు ఆదాయం లేకుండా పోతుంది. ఆ నష్టం భర్తీ చేసేదారులు ఉండవు. మొత్తంగా నేపాల్ కోలుకోవడం ఇప్పుడల్లా సాధ్యమయ్యే విషయం కాదని అంతర్జాతీయ నిపుణుల అంచనా.
తాజా వార్తలు
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో