ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో గల్ఫ్ బాధితునికి సహాయం.

- July 20, 2016 , by Maagulf

ఉపాధి కోసం గత రెండున్నర సంవత్సరాల క్రితం బహ్రెయిన్ కు వచ్చిన భైరగోని సంజీవ్ గౌడ్ వయస్సు (24) గ్రామం ఖానాపూర్ మండలం , జిల్లా నిజామాబాద్ మన తెలంగాణకు చెందిన యువకుడు బహ్రెయిన్ లో ఒక ప్రైవేట్ కంపెనీ లేబర్ గా పనిచేస్తున్న యువకుడు ఆరోగ్యం బాగులేక ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్తే కడుపులో కంతి ( ఫెరలల్ లాప్స్ ) పెరగడం వల్ల కంపెనీ బాధ్యత తీసుకోలేదు, మరి కొన్ని కారణాల వల్ల ఇంటికి వెళ్ళడానికి టికెట్ ఇవ్వకపోవడం రెండున్నర సంవత్సరాలు అయినా లీవ్ జీతం మరియు గత రెండునెలల జీతం ఇవ్వలేదు వెళ్ళడానికి చిల్లి గవ్వలేక కంపెనీ పట్టించుకోక ఉన్న పరిస్థితిలో ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ కమిటీ ని ఆశ్రయించి తన గోడు విన్నవించుకున్నాడు. కమిటీ సభ్యులు ముందుకు వచ్చి తమ వ్యక్తిగతంగా అందరూ కలిసి ప్రయాణ టికెట్ ను కొనిచి తేదీ   19/07/16 మంగళవారం రోజునసాయంత్రం  హైద్రాబాద్ కు  పంపడం జరిగింది.ఆపదలో ఉన్న వారికి ముఖ్యంగా తెలంగాణ కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు .

ఈ కార్యక్రమం లో ఎన్నారై టి.ఆర్.ఎస్. నాయకులు గల్ఫ్ కో ఆర్డినేటర్ సతీష్ కుమార్ రాధారపు, ఇంచార్జ్ వెంకటేష్ బొలిశెట్టి, నాయకులు డా"రవి, చైతన్య, ప్రశాంత్, సదానంద్, గంగాన్న,  గట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్) 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com