స్టార్టప్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్

- July 20, 2016 , by Maagulf
స్టార్టప్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్

 క్రికెట్ అంటే తనకెంతో ఇష్టమని యువ సినీహీరో అక్కినేని అఖిల్ అన్నాడు. కొత్తగా రూపుదిద్దుకున్న స్టార్టప్ క్రికెట్ లీగ్‌కు అతను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల్ మాట్లాడుతూ స్టార్టప్ కంపెనీలు క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నాడు.నాలుగు నగరాల్లో ఈ క్రికెట్‌ను ఆడతారని, గెలుపొందిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతిని అందజేయనునున్నట్లు వెల్లడించాడు. స్టార్టప్ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకులు సాయికిరణ్ మాట్లాడుతూ స్టార్టప్ కంపెనీలకు ఇదో సదావకాశమని తెలిపాడు. వచ్చే నెల 6వ తేదీ నుంచి ఈ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని ఆయన తెలిపాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com