కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం

- October 04, 2025 , by Maagulf
కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం

చెన్నై: తమిళనాడులోని కరూర్ లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో 41మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి.. కళ్లు తెరిచేలోగా పదులసంఖ్యలో ప్రజల మరణాలు, గాయపడ్డవారి ఆర్తనాదాలతో అక్కడొక యుద్ధవాతావరణాన్ని తలపించింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 41 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తాజాగా ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ టీవీకే విజయ్ చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా ఆయనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

నార్త్ జోన్ ఐజీ అస్రాగర్గ్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తుకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తొక్కిసలాట కేసులో జీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ పేరును ఎఫ్ఎఆర్ లో ఎందుకు చేర్చలేదని అడుగుతూ దాఖలు చేసిన రిట్ పిటిసన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక తొక్కిసలాట ఘటన తర్వాత టీవీకే నాయకులందరూ అక్కడి నుండి వెళ్లిపోవడంపై మద్రాసు హైకోర్టు తప్పుపట్టింది. ప్రమాదం గురించి పట్టించుకోకాకుండా పార్టీ నాయకులందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పడం వారి మనస్తత్వాన్ని సూచిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది కోర్టు. తొక్కిసలాటలో 41మంది మృతి చెందినప్పటిటికీ తమిళనాడు ప్రభుత్వం విజయ్ పై ఉదాసీనత చూపిస్తోందని మండిపడింది.

కరూర్ తొక్కిసలాట కేసుపై నిన్న (అక్టోబరు 3) ఉదయం మద్రాసు హైకోర్టులో విచారణ జరిగింది. విజయ్ పక్షం తరపున సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ సందర్భంగా విజయ్ పిటిషన్పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరూర్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ఇంకా ప్రారంభదశలోనే ఉందని తెలిపింది. ఈ సందర్భంగా సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదని, కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చరాదని హితవు పలికింది. టీవీకే నాయకులు కొందరు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఉత్తర్వులను రిజర్వ్ లో ఉంచింది కోర్టు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com