ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- October 04, 2025
యూఏఈ: మిస్ యూనివర్స్ యూఏఈ 2025 కిరీటాన్ని ఫ్యాషన్ విద్యార్థిని అయిన మరియం మొహమ్మద్ సాధించి రికార్డు సృష్టించారు. కఠినమైన ఎంపిక ప్రక్రియ తర్వాత వందలాది మంది దరఖాస్తుదారుల నుండి ఆమె ఎంపికయ్యారు. 27 ఏళ్ల మరియం వచ్చే నెలలో థాయిలాండ్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025లో వేదికపైకి వచ్చిన మొదటి ఎమిరాటీ మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. ఈ సందర్భంగా “పెద్ద కలలు కనడానికి యూఏఈ నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది” అని ఆమె అన్నారు. తాను మహిళల గొంతుకగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మిస్ యూనివర్స్ అనేది కేవలం అందానికే కాదని, మహిళ సాధికారితకు గ్లోబల్ వేదికని తెలిపారు.
సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందిన మరియం, ప్రస్తుతం ESMOD దుబాయ్‌లో ఫ్యాషన్ డిజైన్ చదువుతున్నారు. పేదరికంతో పోరాడటం, మహిళలకు సాధికారత కల్పించడం మరియు ప్రేమ, శాంతితో కూడిన సమాజాలను పెంపొందించడం తన లక్ష్యం అని మరియం పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 950 మందికి పైగా దరఖాస్తుదారులతో పోటీకి అద్భుతమైన స్పందన వచ్చిందని మిస్ యూనివర్స్ యూఏఈ జాతీయ డైరెక్టర్ పాపీ కాపెల్లా అన్నారు.
తాజా వార్తలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..