సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!

- October 04, 2025 , by Maagulf
సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!

రియాద్: సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ విల్లా హెగ్రా ప్రారంభమైంది. అల్ఉలాలో సౌదీ సాంస్కృతిక మంత్రి , అల్ఉలా రాయల్ కమిషన్ గవర్నర్ ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా బిన్ ఫర్హాన్,  అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.  ఫ్రెంచ్ సంస్కృతిక శాఖ మంత్రి రచిదా దాటితో కలిసి ప్రిన్స్ బదర్ కొత్త విల్లా హెగ్రా భవనాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో రెండు దేశాల నుండి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ మద్దతుతో ప్రారంభోత్సవం సాధ్యమైందని ప్రిన్స్ బదర్ X లో ఒక పోస్ట్‌లో తెలిపారు. సౌదీ-ఫ్రెంచ్ సాంస్కృతిక భాగస్వామ్యంలో విల్లా హెగ్రా అత్యంత ముఖ్యమైనదని ఆయన అభివర్ణించారు. "అలులా విజన్" అంతర్జాతీయ సాంస్కృతిక సహకారాన్ని ప్రతిబింబిస్తుందని, సృజనాత్మకతను విస్తరిస్తుందని, సంస్కృతిని స్థిరమైన అభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రిన్స్ బదర్ తెలిపారు.

 ఈ సంస్థ అధికారికంగా రోమ్‌లోని విల్లా మెడిసి మరియు న్యూయార్క్‌ లోని విల్లా ఆల్బర్టినా వంటి చారిత్రక సంస్థలతో పాటు ఫ్రెంచ్ "వివా విల్లా" సాంస్కృతిక నెట్‌వర్క్‌లో చేరుతుందని, ఇది ప్రపంచ సాంస్కృతిక వేదికపై అల్ఉలా స్థానాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com