మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు

- October 04, 2025 , by Maagulf
మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు

కౌలాలంపూర్: మలేషియాలో భారతీయ సమాజాల ఐక్యతను ప్రతిబింబిస్తూ, భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (BAM) ఆధ్వర్యంలో “దసరా • బతుకమ్మ • దీపావళి 2025” మహోత్సవం ఘనంగా జరిగింది. కౌలాలంపూర్‌లోని బ్రిక్ఫీల్డ్స్ టానియా బ్యాంక్వెట్ హాల్‌లో ఈ వేడుకను వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్ హాజరై పాల్గొని ఆశీస్సులు అందించారు. అలాగే భారత హైకమిషనర్ మరియు మలేషియా ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని వేడుకకు మరింత విశిష్టతను చేకూర్చారు.

అతిథులు మాట్లాడుతూ, “ఈ వేడుక తెలుగు వారికే పరిమితం కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల భారతీయులు ఐక్యంగా జరుపుకున్న ఒక గొప్ప సాంస్కృతిక మహోత్సవం. ఇది నిజంగా భారతీయ సంప్రదాయాలకు అద్దం పట్టిన కన్నుల పండుగ” అని ప్రశంసించారు.

సాంప్రదాయ నృత్యాలు, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పండుగ ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. మలేషియాలోని భారతీయ NRIలు విస్తృతంగా పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు.

BAM ప్రధాన కమిటీ సభ్యులు:
చోప్పరి సత్య – అధ్యక్షుడు
భాను ముత్తినేని – ఉపాధ్యక్షుడు
రవితేజ శ్రీదశ్యం – ప్రధాన కార్యదర్శి, IT మరియు PR కమ్యూనికేషన్
రుద్రాక్షల సునీల్ కుమార్ – కోశాధికారి
గజ్జడ శ్రీకాంత్ – సంయుక్త కోశాధికారి
రుద్రాక్షల రవికిరణ్ కుమార్ – యువజన నాయకుడు
గీత హజారే – మహిళా సాధికారత నాయకురాలు
సోప్పరి నవీన్, యెనుముల వెంకట సాయి, అపర్ణ ఉగంధర్, సైచరణి కొండ, రహిత, సోప్పరి రాజేష్, పలకలూరి నాగరాజు – కార్యవర్గ సభ్యులు

BAM అధ్యక్షుడు చోప్పరి సత్య మాట్లాడుతూ, “ఈ వేడుకను విజయవంతం చేయడంలో సహకరించిన భారత హైకమిషన్, మలేషియా ప్రభుత్వ అధికారులు, అతిథులు, స్పాన్సర్లు, కమిటీ సభ్యులు మరియు మలేషియాలోని భారతీయ సమాజానికి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.ఈ వేడుక మలేషియాలో భారతీయ సంస్కృతీ సౌహార్దతకు అద్భుతమైన ప్రతీకగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com