యూఏఈలో విషాదం.. తండ్రి, 7 నెలల శిశువు మృతి, ICUలో తల్లి..!!
- October 08, 2025
యూఏఈ: యూఏఈలో విషాదకరమైన యాక్సిడెంట్ జరిగింది. సోమవారం సాయంత్రం ఖోర్ ఫక్కన్‌లో రెండు వాహనాల ఢీకొనడంతో 41 ఏళ్ల ఎమిరాటీ తండ్రి, అతని ఏడు నెలల కుమారుడు ప్రాణాలు కోల్పోగా, అతని భార్య మరియు మరొక డ్రైవర్ గాయపడ్డారు.
షార్జా పోలీసుల కథనం ప్రకారం, అక్టోబర్ 6న రాత్రి 8.55 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అతివేగం మరియు ఒక వాహనం అకస్మాత్తుగా పక్కకు జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీంతో వెనకున్న వాహన డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తల్లి ఐసీయూలో చికిత్స పొందుతుందని వైద్య అధికారుల తెలిపారు. ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







