మక్కాలో మహిళలపై వేధింపులు..ఆఫ్ఘన్ జాతీయుడు అరెస్టు..!!

- October 10, 2025 , by Maagulf
మక్కాలో మహిళలపై వేధింపులు..ఆఫ్ఘన్ జాతీయుడు అరెస్టు..!!

మక్కాః మక్కాలో మహిళలను వేధించిన ఆఫ్ఘన్ జాతీయుడు జాహిద్ ఖాన్ సుహైర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించారు.  అన్ని రకాల అనైతిక చర్యలను ఎదుర్కోవడానికి కమ్యూనిటీ సెక్యూరిటీ టీమ్ లను ఏర్పాటు చేసినట్టు సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వేధింపుల నిరోధక చట్టం ప్రకారం, వేధింపుల నేరానికి పాల్పడే ఎవరికైనా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు SR100,000  జరిమానా లేదా  రెండు శిక్షలను విధించే అవకాశం ఉంది. నేరం పునరావృతమైతే, ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు SR300,000 జరిమానా విధిస్తారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com