ఒమన్ లో వైభవంగా దీపావళి వేడుకలు..!!
- October 19, 2025
మస్కట్: ఒమన్‌లో నివసిస్తున్న భారతీయ ప్రవాసులు దీపావళి పండుగను జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 20న జరుపుకునే దీపావళి పండుగను పురస్కరించుకొని మస్కట్ అంతటా భారతీయ నివాసితుల ప్లాట్ల బాల్కనీల వెంట రంగు రంగుల స్ట్రింగ్ లైట్లు వెలుగులు విరజిమ్ముతున్నాయి. కిటికీల గుమ్మాలపై LED దీపాలు వెలుగులీనుతున్నాయి. డ్రైవ్వేలపై కొవ్వొత్తులు మెరుస్తున్నాయి.
దీపావళి పండుగను పురస్కరించుకొని నగరంలోని అగ్రశ్రేణి రెస్టారెంట్లు, హోటళ్ళు ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నాయి. విలాసవంతమైన భారతీయ మెనూలను అందిస్తున్నాయి. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నాయి. షెరాటన్ ఒమన్ అక్టోబర్ 20న దీపావళి ప్రత్యేక విందును నిర్వహిస్తుంది. ఈ వేడుక సాయంత్రం 7:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు కొనసాగుతుంది.
అలాగే, రువి మరియు రెక్స్ రోడ్లలో స్వీట్ దుకాణాలు సాంప్రదాయ భారతీయ స్వీట్లు, సావరీల రంగురంగుల ట్రేలతో ఆకట్టుకుంటున్నాయి. మస్కట్‌లో 35 ఏళ్లుగా కమ్యూనిటీకి సేవలందిస్తున్న బాంబే స్వీట్స్, ప్రత్యేక పండుగ హాంపర్లను అందిస్తోంది. రువి లోని ఆభరణాల దుకాణాలలో భారీ పండుగ సందడి నెలకొన్నది.
తాజా వార్తలు
- అమెరికా H-1B వీసా ఫీజు పై సంచలన నిర్ణయం
- నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం..
- విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- దీపావళి వేడుకలు.. 19 మందికి గాయాలు
- మోటార్‌సైకిలిస్టు మృతి..డ్రైవర్ కు జైలు శిక్ష..!!
- ఖతార్ లో O-నెగటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్..!!
- ఒమన్- తుర్కియే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి..!!
- 20 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ లేన్ క్లోజ్..!!
- సౌదీ అరేబియాలో రిక్రూట్ మెంట్ కంపెనీలపై కొరడా..!!
- యూఏఈలో ఘనంగా దీపావళి వేడుకలు..!!