రియో ఒలింపిక్స్ కి వెళ్లనున్న మాస్టర్ బ్లాస్టర్

- July 22, 2016 , by Maagulf
రియో ఒలింపిక్స్ కి వెళ్లనున్న మాస్టర్ బ్లాస్టర్

రియో ఒలింపిక్స్‌ క్రీడా సంబరంలో పాల్గొనాలని భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ) అధ్యక్షుడు థామస్‌ బాక్‌ ఆహ్వానించారు. తెందుల్కర్‌ ప్రస్తుతం భారత ఒలింపిక్‌ సంఘానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ జరుగనున్న రియోడిజెనిరో నగరానికి ఆగస్టు 2న చేరుకొని గేమ్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులను సచిన్‌ ఉత్సాహపరచనున్నట్లు సమాచారం. జికా వైరస్‌తో ముప్పున్న బ్రెజిల్‌ లాంటి దేశాలకు వెళ్లాల్సిన వారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఎల్లో ఫీవర్‌ వ్యాక్సిన్‌ను సచిన్‌ ఈ మధ్యే ముంబయిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వేయించుకున్నాడు. గత కొద్ది రోజుల క్రితం లండన్‌లో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సచిన్‌ రియో ప్రయాణానికి సంసిద్ధమై అక్కడ భారత క్రీడాకారులకు మద్దతు పలికేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com