నిన్న గల్లంతైన విమానం ఆచూకి ఇంకా లభించలేదు
- July 22, 2016
నిన్న గల్లంతైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం ఏఎన్-32 ఆచూకి ఇంకా లభించలేదు. ఎయిర్‌ఫోర్స్ విమానంలో మొత్తం 29 మంది ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ఆరుగురు, ఎన్ఏడీ సిబ్బంది 8 మందియ ఉన్నారు. చెన్నై తీరానికి 280 కి.మీ దూరంలో విమానం అదృశ్యం అయిందని రక్షణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. టర్పునావికాదళానికి చెందిన 12 నౌకలు, ఒక సబ్ మెరైన్, 2 పీ-8ఐ విమానాలు, రెండు డార్నియాల ఆ విమానం కోసం గాలిస్తున్నాయి.గల్లంతైన విమానంలో విశాఖ వాసులు, ఎన్‌ఏడీకి చెందిన 20మందికి పైగా ఉద్యోగులున్నట్లు సమాచారం. చార్జ్‌మెన్ సాంబమూర్తి, క్వాలిటీ ఇన్స్పెక్టర్ భూపేంద్రసింగ్, ఆర్మామెంట్ ఫిట్టర్లు ప్రసాద్‌బాబు, నాగేందర్రావు, సేనాపతి, మహారాణా, మల్టీ టాస్కింగ్ సిబ్బంది, శ్రీనివాసరావు, చిన్నారావు కుటుంబాలకు సమాచారం అందజేశారు. విమాన దుర్ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









