నిన్న గల్లంతైన విమానం ఆచూకి ఇంకా లభించలేదు

- July 22, 2016 , by Maagulf
నిన్న గల్లంతైన  విమానం ఆచూకి ఇంకా లభించలేదు

నిన్న గల్లంతైన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఏఎన్‌-32 ఆచూకి ఇంకా లభించలేదు. ఎయిర్‌ఫోర్స్ విమానంలో మొత్తం 29 మంది ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది ఆరుగురు, ఎన్‌ఏడీ సిబ్బంది 8 మందియ ఉన్నారు. చెన్నై తీరానికి 280 కి.మీ దూరంలో విమానం అదృశ్యం అయిందని రక్షణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. టర్పునావికాదళానికి చెందిన 12 నౌకలు, ఒక సబ్ మెరైన్, 2 పీ-8ఐ విమానాలు, రెండు డార్నియాల ఆ విమానం కోసం గాలిస్తున్నాయి.గల్లంతైన విమానంలో విశాఖ వాసులు, ఎన్‌ఏడీకి చెందిన 20మందికి పైగా ఉద్యోగులున్నట్లు సమాచారం. చార్జ్‌మెన్ సాంబమూర్తి, క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌ భూపేంద్రసింగ్, ఆర్మామెంట్ ఫిట్టర్లు ప్రసాద్‌బాబు, నాగేందర్‌రావు, సేనాపతి, మహారాణా, మల్టీ టాస్కింగ్ సిబ్బంది, శ్రీనివాసరావు, చిన్నారావు కుటుంబాలకు సమాచారం అందజేశారు. విమాన దుర్ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com