ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!

- October 22, 2025 , by Maagulf
ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో 2024లో గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన వైద్య పరికరాల దిగుమతులు 56.8 శాతం పెరిగాయి.  గతేడాది OMR3.3 మిలియన్ల దిగుమతులు కాగా, ఈ ఏడాది OMR5.2 మిలియన్లకు చేరుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) విడుదల చేసిన నివేదిక తెలిపింది. 

ఈ దిగుమతులు గుండె సంబంధ వ్యాధులకు రోగ నిర్ధారణ మరియు చికిత్సా సామర్థ్యాలను బలోపేతం చేసాయని పేర్కొంది. దిగుమతుల్లో అధికంగా ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్‌లు, కార్డియాక్ పేస్‌మేకర్‌లు మరియు వైద్య అనలైజ్ ఎక్స్-రే పరికరాలు ఉన్నాయి.   జీవన నాణ్యత మరియు ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను మెరుగుపరచడానికి ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరుస్తున్నారని నివేదిక తెలిపింది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com