కువైట్ ఇ-వీసా సర్వీస్ ప్రారంభం
- July 23, 2016
డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇంటీరియర్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ అల్ ఖాలెద్ అల్ హమాద్ అల్ సబా, ఎలక్ట్రానిక్ వీసా సిస్టమ్‌ని కువైట్ ఇంటర్నేసనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా ప్రయాణీకులు వీసా పొందేందుకు వీలుగా ఈ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు మినిస్టర్ షేక్ మొహమ్మద్ చెప్పారు. ఈ విధానంలోని అన్ని సౌకర్యాల్నీ మినిస్టర్ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. నిపుణులైనవారితో ఈ సౌకర్యాన్ని ప్రయాణీకులకు ఎలాంటి సమస్యలూ లేకుండా అందుబాటులో ఉంచాలని మినిస్టర్ అధికారులకు సూచించారు. వలసదారులకోసం ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడ్తుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మారెఫి చెప్పారు. 13 ప్రొఫెషన్స్‌కి ప్రత్యేక సర్వీసులను అందిస్తున్నామనీ, అలాగే ఆరు నెలలకు మించి రెసిడెన్సీ వీసాను వలసదారులకోసం అందజేస్తున్నామని ఆయన తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లోని పలు సెక్టార్లలో మంత్రితో కలిసి మేజర్ జనరల్ కలియతిరిగారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









