అల్-సబాహియాలో లూనా పార్క్‌ ప్రారంభం..!!

- October 24, 2025 , by Maagulf
అల్-సబాహియాలో లూనా పార్క్‌ ప్రారంభం..!!

కువైట్: దక్షిణ అల్-సబాహియాలో లూనా పార్క్‌ను టూరిస్టిక్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ (TEC) ప్రారంభించింది. అన్ని వయసుల వారికి ఇది ఒక ఆకర్షణీయ ప్రాంతంగా ఉంటుందని తెలిపారు. ఈ పార్క్‌ లో పెద్దలు మరియు పిల్లల కోసం 50 కి పైగా రైడ్‌లు, 13 స్కిల్ గేమ్‌లు ఉన్నాయని అధికారిక ప్రతినిధి అబ్దుల్లా అల్-రఫీ తెలిపారు. ప్రసిద్ధ రెస్టారెంట్లు, కేఫ్‌లు, చైనీస్ మార్కెట్ మరియు లూనా బజార్ వంటి స్టాల్స్ ఉన్నాయని అన్నారు. ప్రతి రోజు పిల్లల కోసం ప్రత్యేక ప్రదర్శనలు, ఫైర్ వర్క్స్  ఉంటాయని తెలిపారు. 

టూరిస్టిక్ ఎంటర్‌ప్రైజెస్ అప్లికేషన్ ద్వారా లేదా ఆన్-సైట్ టికెట్ విండోలో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చని అల్-రఫీ వివరించారు. ప్రవేశ రుసుము రెండు కువైట్ దినార్లు, ఇందులో పిల్లలకు 20 రైడ్‌లు ఉంటాయని,  వికలాంగులకు ప్రవేశం ఉచితమని తెలిపారు. ఈ పార్క్ ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుంది.  ప్రారంభోత్సవంలో TEC సీఈఓ అన్వర్ అల్-హులైలా మరియు అనేక కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com