కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!

- October 24, 2025 , by Maagulf
కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!

కువైట్: కువైట్ లో ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరులు ప్రాణాలను పణంగా పెడుతున్న వారిపై జీరో టోలరెన్స్ విధానం అమలు చేస్తున్నట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు  జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ప్రధాన రహదారి ఉల్లంఘనలపై కఠిన చర్యలు ప్రారంభించింది.   ఇందులో భాగంగా గత సోమవారం ఒకే రోజు 823 ఉల్లంఘనలతో సహా, కేవలం ఏడు రోజుల్లోనే దాదాపు 4,500 ఓవర్‌టేకింగ్ కేసులను నమోదు చేశారు. ఉల్లంఘనలను గుర్తించేందుకు అధునాతన కెమెరాలను ఉపయోగిస్తున్నారు. 

ఓవర్‌టేకింగ్ ఉల్లంఘనలతోపాటు  ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, పబ్లిక్ రోడ్లపై నో-పార్కింగ్ జోన్‌లలో పార్కింగ్ చేయడం వంటి నాలుగు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాలను 60 రోజుల పాటు సీజ్ చేస్తామని మంత్రిత్వశాఖ హెచ్చరించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com