బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- October 28, 2025
మనామా: బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ ఇకపై కఠినం కానుంది. ఈ మేరకు వీసాల జారీకి సంబంధించి ఒక ప్రతిపాదన పార్లమెంట్ ముందుకు రానుంది. ఇకపై బహ్రెనైజేషన్ ఆధారంగానే ఆయా సంస్థలు వీదేశీ స్టాఫ్ కు వీసాలు జారీ చేయాలని అందులో ప్రతిపాదించారు. ఎంపీ డాక్టర్ మునీర్ సెరూర్ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదన.. అర్హత కలిగిన బహ్రెయిన్‌లకు మొదటగా ఉద్యోగాలు కల్పించాలని పిలుపునిస్తుంది.
ఇప్పటికే లేబర్ మార్కెట్ లో శిక్షణ పొందిన బహ్రెయిన్ లు ఉన్నారని, అయితే స్పష్టమైన నియామక ప్రణాళిక లేకపోవడం వారి పాత్రను పరిమితం చేసిందని పేర్కొన్నారు. పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు అర్హత కలిగిన బహ్రెయిన్ల జాతీయ డేటాబేస్ లో నమోదైన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదన నిర్దేశిస్తుంది. తగిన సామర్థ్యాలు కలిగిన బహ్రెయిన్లు అందుబాటులో లేని చోట మాత్రమే తాత్కాలికంగా విదేశీయులను నియమించాలని సూచించారు.
తాజా వార్తలు
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్







