FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!

- October 29, 2025 , by Maagulf
FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!

రియాద్: సౌదీ అరేబియాలో నిర్వహిస్తున్న ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ (FII) ప్రోగ్రామ్స్ విజయవంతం అయ్యాయి. ఇప్పటివరకు తొమ్మిది ఎడిషన్లను నిర్వహించగా, వాటిల్లో సుమారు 250 బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) గవర్నర్, FII ఛైర్మన్ యాసిర్ అల్-రుమయ్యన్ తెలిపారు.

రియాద్‌లోని కింగ్ అబ్దులాజీజ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆధ్వర్యంలో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ 9వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో అల్-రుమయ్యన్ పాల్గొని ప్రసంగించారు. కొత్త ప్రపంచ నమూనా మరియు బలమైన అంతర్జాతీయ సహకారం అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు.

ప్రపంచ మొత్తం GDP ఇప్పుడు $111 ట్రిలియన్లను దాటిందని, ప్రపంచ పెట్టుబడిదారులను ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో FII సక్సెస్ అయిందని తెలిపారు. ప్రపంచ దేశాలను ఏకం చేసే మోడల్ ను ఈ సమావేశంలో ఆవిష్కరించనున్నట్లు అల్-రుమయ్యన్ ప్రకటించారు.  సౌదీ అరేబియా కు విదేశీ పెట్టుబడుల ప్రవాహం గత సంవత్సరం 24% పెరిగి 31.7 బిలియన్ల డాలర్లకు చేరుకుందని అల్-రుమయ్యన్ వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టుబడిదారులను అనుసంధానించే ప్రముఖ అంతర్జాతీయ కేంద్రంగా రియాద్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com