భారత్ లో నేడు రంజాన్ పండుగ
- July 17, 2015
ముగిసిన ఉపవాస దీక్షలు - ముస్తాబైన ఈద్గాలు, మసీదులు - శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం సాక్షి, హైదరాబాద్: ముస్లిం సోదరులు పవిత్రమైన రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) పండుగను నేడు(శనివారం) అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో ఈద్-ఉల్ -ఫితర్ను జరుపుకోవాలని హైదరాబాద్ రువాయత్-ఏ-హిలాల్ కమిటీ ప్రకటించింది. దీంతో రంజాన్ ఉపవాస దీక్షలు ముగిసినట్లయింది. రాష్ట్రవ్యాప్తంగా ముస్తాబైన ఈద్గాలు, మసీదుల్లో ఉదయం ఈద్-ఉల్-ఫితర్ సామూహిక ప్రార్థనలు పెద్దఎత్తున జరగనున్నాయి. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







