సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- November 02, 2025
రియాద్: సౌదీ అరేబియాలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాలను ఉల్లంఘించే వారిపై అధికారులు కఠినంగా వ్యవహారిస్తున్నారు. గత వారం రోజుల్లో వివిధ చట్టాలను ఉల్లంఘించిన 21,651 మందిని అరెస్టు చేసినట్లు భద్రతా దళాలు తెలిపాయి.
ఇందులో నివాస చట్టాలను ఉల్లంఘించిన 12,745 మంది, అక్రమ సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన 4,577 మంది, కార్మిక సంబంధిత చట్టాలను ఉల్లంఘించిన 4,329 మంది ఉన్నారు. బార్డర్ క్రాస్ చేస్తూ అరెస్టయిన 1,689 మందిలో 53 శాతం మంది ఇథియోపియన్లు, 46 శాతం మంది యెమెన్లు ఉన్నారు.
సౌదీలోకి అక్రమ ప్రవేశానికి సాయం చేసేవారికి గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, SR1 మిలియన్ ($267,000) వరకు జరిమానా విధించడంతోపాటు వారి ఇండ్లు, వాహనాలను జప్తు చేస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
మక్కా మరియు రియాద్ ప్రాంతాలలో టోల్-ఫ్రీ నంబర్ 911, ఇతర ప్రాంతాలలో 999 లేదా 996 నంబర్ల ద్వారా అనుమానితుల వివరాలను తెలియజేయాలని కోరింది.
తాజా వార్తలు
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!







