మాతృభాష
- July 17, 2015
అనగనగా రామాపురం, సీతాపురం అనే రెండు ఊళ్లు పక్కపక్కనే ఉండేవి. ఆ రెండింటికీ ఎప్పుడూ ప్రతీ విషయంలోనూ పోటీ ఉండేది. ఒకరోజు రామాపురం నుండి సీతాపురం ఊరిలోకి సుబ్బయ్య అనే పండితుడు వచ్చి నాకు పది భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఎంత ప్రావీణ్యం అంటే నా మాతృభాష ఏదో కూడా కనిపెట్టలేనంత.. అన్నాడు. దమ్ముంటే మీ ఊరిలోని పండితుడెవరైనా వచ్చి నా మాతృభాష ఏదో కనిపెట్టగలరేమో కనుక్కోండి చూద్దాం అని సవాల్ విసిరాడు. అందుకు ఆ ఊరి పెద్ద ఈ బాధ్యతను ఆ ఊరి పండితుడు చైత్రయ్యకు ఈ పనిని అప్పగించగా.. చైత్రయ్య, సుబ్బయ్యను చాలా విధాలుగా ప్రయత్నించి చూశాడు. కానీ కనిపెట్టలేకపోయాడు. ఆ రోజు రాత్రి ఒక ఉపాయం ఆలోచించి సుబ్బయ్య నిద్రపోయాక అతని గది వద్దకు ఒక కోరలు తీసిన పాముని పంపించాడు. ఆ పాము అతని గది కిటికీ గుండా వెళ్లి మంఛం మీద నిద్రపోతున్న సుబ్బయ్య మీదకి ఎక్కి బుసలు కొట్టసాగింది. దాంతో అకస్మాత్తుగా నిద్ర మేల్కొని, 'అమ్మోయ్, బాబోయ్ కాపాడండి కాపాడండి' అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ఎంత గొప్పవారైనా సరే బాధ కలిగినపుడు, కష్టం కలిగినప్పుడు ఖచ్చితంగా తన మాతృ భాషలోనే ఉచ్ఛరిస్తారు. దాంతో అతని మాతృభాష 'తెలుగు' అని అందరికీ తెలిసింది. దాంతో చైత్రయ్యను ఊరి పెద్దతో పాటు ఊరి జనం కూడా మెచ్చుకుని అభినందనలతో ముంచెత్తారు. సుబ్బయ్య తన గర్వభంగానికి సిగ్గుతో తల వంచుకుని చైత్రయ్యకు, ఊరి జనానికి క్షమాపణలు చెప్పి తన ఊరికి బయలుదేరాడు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







