ప్రభాస్‌పై ఆర్.జి.వి ట్వీట్
- July 18, 2015
బాహుబలి హీరో ప్రభాస్‌పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. బాహుబలితో స్టార్ డమ్ సాధించిన ప్రభాస్‌ను వర్మ ఆకాశానికెత్తేశారు. కేవలం ఒక్క సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు షూటింగ్‌లో పాల్గొన్న ప్రభాస్‌ను చూసి..తప్పు చేశాడని అనుకుని మనమే ఫూల్స్ అయ్యామని ట్వీట్ చేశాడు. రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా మరింత తప్పు చేశాడని అనుకున్నామని వర్మ చెప్పాడు.అయితే బాహుబలి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న బాహుబలి పార్ట్ - 1 లాభాల్లోంచి ప్రభాస్‌కు రూ. 65 కోట్ల షేర్ వచ్చిందన్నాడు. ఒక్క సినిమా కోసం రూ. 65 కోట్లు తీసుకున్న హీరో భారతీయ సినీ చరిత్రలో మరెవరైనా ఉన్నారా ? అని ప్రశ్నించాడు. కేవలం రెండేళ్ల కష్టానికే ప్రభాస్‌కు అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చిందని ట్విట్టర్లో తెలిపాడు.ఇకపోతే.. బాహుబలి చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పాత రికార్డులన్నింటినీ చెరిపేస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 220 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తెలుగు సినిమాను శిఖర స్థాయికి చేర్చిన రాజమౌళి మ్యాజిక్ మరిన్ని రోజులు కొనసాగుతుందని సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.హిందీ వర్షన్ రూపంలో రూ. 35 కోట్లు రాగా , దక్షిణాది చిత్రం హిందీలో అనువాదమై ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి. గత వారాంతంలో రూ. 105 కోట్ల షేర్ సాధించిన బాహుబలి , ధూమ్ (రూ. 100 కోట్లు) , హ్యాపీ న్యూ ఇయర్ (రూ. 99 కోట్లు) రికార్డులను తిరగరాసింది. ఇక అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా ఉన్న ' రోబో ' ( రూ. 290 కోట్లు) దాటేందుకు బాహుబలికి మరింత సమయం పట్టకపోవచ్చని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







