రజనీ, కమల్ కాంబోలో సినిమా
- November 06, 2025
సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌ల కాంబినేషన్ లో సినిమా ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తుంది. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి నటించబోతున్నారా?అన్న చర్చలు గత కొన్ని రోజులుగా వేడెక్కాయి. తాజాగా ఆ ఊహాగానాలకు తెరదిస్తూ కమల్ హాసన్ స్వయంగా పెద్ద అనౌన్స్మెంట్ చేశారు.
తాజా సమాచారం ప్రకారం, రజనీకాంత్ హీరోగా నటించే కొత్త సినిమా ‘తలైవర్ 173’ (#Thalaivar173) నిర్మాణ బాధ్యతలను కమల్ హాసన్ తీసుకున్నారు. అంటే ఈ సినిమా ద్వారా కమల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి సుందర్.సి (Sundar C) దర్శకత్వం వహించనున్నారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఇప్పటికే ఈ బ్యానర్ కింద పలు సూపర్ హిట్ సినిమాలు రూపొందిన సంగతి తెలిసిందే.
2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.”సుందర్ సి దర్శకత్వంలో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మించే మాగ్నమ్ ఓపస్ #తలైవర్173 (Thalaivar 173) లో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ ల్యాండ్ మార్క్ కలయిక భారతీయ సినిమాలో రెండు ఉన్నత శక్తులను ఏకం చేయడమే కాకుండా, జనీకాంత్ – కమల్ హాసన్ (Rajinikanth and Kamal) మధ్య ఐదు దశాబ్దాల స్నేహం, సోదరభావాన్ని సెలబ్రేట్ చేయనుంది. ఇది రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raj Kamal Films International) 44 సంవత్సరంలో సుందర్ సి దర్శకత్వంలో కమల్ – ఆర్ మహేంద్రన్ నిర్మాణంలో రజనీకాంత్ మ్యాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఏకం చేస్తుంది.
2027 పొంగల్ సందర్భంగా రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధం చేస్తున్నాం” అని మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు.రజనీకాంత్ – డైరెక్టర్ సుందర్ సి (Sundar C) కాంబినేషన్లో 1997లో ‘అరుణాచలం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబోలో ‘తలైవా 173’ (Thalaivar 173) సినిమా చేస్తుండటంతో అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి.
తాజా వార్తలు
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







