ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- November 06, 2025
మచిలీపట్నం: ప్రముఖ పరిశ్రమాధిపతి, గ్రీన్‌కో గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ చలమలశెట్టి తండ్రి డా. చలమలశెట్టి సురేంద్రనాథ్ కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు — సునీల్, అనిల్, వెంకటేశ్ ఉన్నారు.
డా. సురేంద్రనాథ్ వైద్యరంగంలో విశేష సేవలందించి, ప్రజాహిత భావనతో మంచి గుర్తింపు పొందారు. ఆయన అల్జీరియా దేశంలో కూడా అనేక సంవత్సరాలు వైద్య సేవలు అందించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పరిశ్రమల వర్గం తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
డా. సురేంద్రనాథ్ భౌతికకాయాన్ని మచిలీపట్నం అంత్యక్రియలు నిర్వహించారు.
గ్రీన్‌కో సంస్థాధినేతలు చలమలశెట్టి సునీల్, అనిల్ తండ్రి మరియు మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటలక్ష్మి భర్త అయిన డా. చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతిపట్ల పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్, కృష్ణా జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, ఆయన సోదరుడు రాష్ట్ర బీసీ నాయకుడు, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య నిన్న మచిలీపట్నం చేరి డా. సురేంద్రనాథ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ ద్వారా చలమలశెట్టి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్‌ఆర్టీసీ పాలకమండలి సమావేశం







