'కబాలి' తమిళనాడులో మాత్రమే రూ.100 కోట్లు..
- July 24, 2016
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం 'కబాలి' ఈ నెల 22వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. పా.రంజిత్ దర్శకత్వంలోని ఈ సినిమాలో రాధిక ఆప్టే కథానాయికగా నటించారు. కలైపులి థాణు నిర్మాత. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,000 థియేటర్లలో విడుదలైంది. తొలిరోజు దేశంలో ఏకంగా రూ.250 కోట్ల వరకు కలెక్షన్లు సొంతం చేసుకున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో మాత్రమే రూ.100 కోట్లు; దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రూ.150 కోట్ల వరకు వసూలయ్యాయని పేర్కొన్నాయి. మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత థాణు ప్రకటించినట్లు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. విదేశాల్లో రూ.వంద కోట్ల వరకు కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. గతంలో అజిత్ హీరోగా వచ్చిన 'వేదాలం', విజయ్ నటించిన 'కత్తి' రికార్డులను కూడా ఈ సినిమా తిరగరాసిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









