బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…

- November 17, 2025 , by Maagulf
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పై నడుస్తున్న కేసుకు సంబంధించిన తీర్పు సోమవారం వెలువడనున్న నేపథ్యంలో దేశం మొత్తం టెన్షన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో రాజధాని ఢాకాలో వరుసగా క్రూడ్ బాంబు పేలుళ్లు, అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో భయం మరింత పెరిగింది. పోలీసులు హింసాత్మకంగా ప్రవర్తించే వ్యక్తులపై అవసరమైతే కాల్పులు జరపండి అని ఆదేశాలు జారీ చేశారు.

ఆదివారం ఢాకాలో పలు ప్రాంతాల్లో క్రూడ్ బాంబులు పేలినట్టు పోలీసులు రాయిటర్స్‌కి ధృవీకరించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ నగరంలో గత వారం నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ఈ ఘటనలు మరో పొర చేరినట్టయ్యింది. తీర్పు ముందస్తు వాతావరణంలో మొత్తం నగరంలో భద్రత కట్టుదిట్టం చేయబడింది.

78 ఏళ్ల షేక్ హసీనాపై గత సంవత్సరం విద్యార్థులపై జరిగిన హింసకు ఆమె ఆదేశాలే (Dhaka Bomb Blasts) కారణమని ఆరోపణలు ఉన్నాయి. “మానవత్వంపై నేరాలు” కింద ఆమెను గైర్హాజరీలోనే విచారిస్తున్నారు. అన్ని ఆరోపణలనూ తిరస్కరించిన హసీనా, 2024 ఆగస్టులో పదవి నుండి వెళ్లిపోయిన తర్వాత భారతదేశంలో ఆశ్రయం పొందారు.

ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్–బంగ్లాదేశ్ (ICT-BD) తీర్పు ముందు, హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ ప్రకటించిన రెండు రోజుల బంద్ నేపథ్యంలో భద్రతా దళాలు (Dhaka Bomb Blasts) సైన్యం, పారామిలటరీ, పోలీసులు—అన్నీ హై అలర్ట్‌లోకి వెళ్లాయి.

ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న వాహనాల డంపింగ్ యార్డును తగలబెట్టారు. అంతేకాక, ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ ప్రభుత్వ సలహా మండలి సభ్యుడి ఇంటి బయట రెండు క్రూడ్ బాంబులు పేల్చారు.

ఢాకాలోని పలు జంక్షన్ల వద్ద కూడా పేలుళ్లు చోటుచేసుకున్నాయి. DMP కమిషనర్ SM సజ్జత్ అలీ మాట్లాడుతూ—“పట్టణంలో బస్సులకు నిప్పంటించడం, బాంబులు విసరడం, ప్రజలను చంపే ఉద్దేశ్యంతో దాడులు చేయడం లాంటి ఘటనలు జరిపే వారిని అవసరమైతే కాల్చేయవచ్చు. చట్టం ఇచ్చిన అధికారాన్ని పోలీసులు వినియోగించాలి” అని స్పష్టం చేశారు.

నవంబర్ 10 నుంచి ఢాకాలో పలు ప్రాంతాల్లో ముఖ్యంగా తెల్లవారుజాము సమయంలో దాడులు జరుగుతున్నాయి.మిర్‌పూర్‌లో ఉన్న గ్రామీన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముందు క్రూడ్ బాంబులు విసరడం, బ్యాంక్ శాఖలపై సమన్వయంతో పెట్రోల్ బాంబులు, అగ్నిప్రమాదాలు జరగడం వంటి ఘటనల్ని అధికారులు గుర్తించారు.

ICT-BD ప్రాసిక్యూటర్లు హసీనాకు మరణదండన విధించాలని కోర్టును కోరిన నేపథ్యంలో కేసు చుట్టూ ఉన్న ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com