సీజన్-9 చివరి కెప్టెన్‌గా కళ్యాణ్

- November 28, 2025 , by Maagulf
సీజన్-9 చివరి కెప్టెన్‌గా కళ్యాణ్

బిగ్‌బాస్ హౌస్‌ లో గత నాలుగు రోజులుగా కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు దుమ్మురేపిన విషయం తెలిసిందే.ఈసారి ప్రత్యేకంగా ఎక్స్ కంటెస్టెంట్లను పిలిచి టాస్కులు నిర్వహించారు. వారిని ఓడించినవారే కంటెండర్లుగా ఎంపికయ్యారు.చివరకు కళ్యాణ్, డీమాన్, ఇమ్మానుయేల్, దివ్య, సంజన, రీతూ.. మొత్తం ఆరుగురు కంటెండర్లుగా నిలిచారు.ఇదిలా ఉండగా, తనూజ, భరణి, సుమన్ శెట్టి టాస్కుల్లో ఓడిపోయారు.చివరి కెప్టెన్‌ను నిర్ణయించే టాస్క్‌కి బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.

కంటెండర్లకు కాదు…కంటెండర్లు కాకపోయిన తనూజ, భరణి, సుమన్ శెట్టిలకే ఈ టాస్క్ ఇచ్చాడు. బజర్ మోగగానే ఈ ముగ్గురిలో ఎవరు ముందు కత్తిని తీసుకుంటే, వారు తాము కెప్టెన్‌గా చూడాలనుకునే కంటెండర్‌కు ఆ కత్తిని అందించాలి. కత్తిని అందుకున్న కంటెండర్ మాత్రం రేసులోని ఒకరిని ఎలిమినేట్ చేయాలి.

సుమన్ శెట్టి కత్తి అందుకొని రీతూకి ఇచ్చాడు. ఇక రీతూ ఊహించినట్లే సంజనని పొడిచింది. మీరు గేమ్ గురించి కాకుండా పర్సనల్ విషయాల గురించి మాట్లాడి.. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని చూశారంటూ రీతూ చెప్పింది. దీనికి మరోసారి సంజన ఫైర్ అయింది.ఇక్కడ ఎవరికీ పర్సనల్స్ ఏం ఉండవ్.. ఇదంతా గేమ్‌యే అంటూ సంజన చెప్పింది.

ఆ తర్వాత భరణి.. డీమాన్ చేతికి కత్తి ఇచ్చాడు. దీంతో డీమాన్.. నేరుగా ఇమ్మానుయేల్‌ని పొడిచాడు. నేను అడిగినప్పుడు నువ్వు నాకు సాయం చేయలేకపోయావ్ అంటూ మొన్న నామినేషన్స్ పాయింట్‌యే చెప్పాడు డీమాన్. ఈ మాటకి ఇమ్మూకి కాలింది.నేను ఏడిస్తే ఏడుపొస్తుంది.. నవ్వితే నవ్వొస్తుంది అంటూ ఇక సొల్లు చెప్పకు.. పాయింట్లు లేకపోతే నేను ఇష్టం లేదని చెప్పు.. అంతేకానీ ఇవన్నీ వద్దు అంటూ ఇమ్మూ ఫైర్ అయ్యారు.

ఇక నుంచి నాతో ఇవన్నీ వద్దు అంటూ గట్టిగానే చెప్పాడు ఇమ్మూ.ఇలా మొత్తానికి అందరూ రేసు నుంచి తప్పుకోగా కళ్యాణ్ మిగిలాడు. దీంతో సీజన్-9 (Bigg Boss 9) చివరి కెప్టెన్ కళ్యాణ్ అయ్యాడన్నమాట.కళ్యాణ్ ఇప్పటికే ఒకసారి కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు రెండోసారి కెప్టెన్ అయ్యాడు. ఇక సీజన్-9కి శుభం కార్డు పడటానికి మూడు వారాలు మాత్రమే ఉంది. హౌస్‌లో ప్రస్తుతం 9 మంది సభ్యులు ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com