కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!
- December 01, 2025
కువైట్: కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటీవల జ్లీబ్ అల్-షుయౌఖ్‌లో 67 శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేశారు. దీంతో ఖైతాన్, అల్-ఫిర్దౌస్, అల్-అండలస్, అల్-రాబియా మరియు అల్-ఒమారియాతో సహా సమీపంలోని ప్రైవేట్ నివాస ప్రాంతాలకు ప్రవాస బ్యాచిలర్ కార్మికులు గణనీయంగా మారుతున్నట్లు అధికారులు గుర్తించారు. నివాసితుల భద్రతను దృష్టిలో పెట్టుకొని బ్యాచిలర్ హౌసింగ్‌ను అరికట్టే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
కువైట్ మునిసిపాలిటీ ఉల్లంఘనలను నియంత్రించడానికి, ప్రైవేట్ నివాస మరియు మోడల్ హౌసింగ్ జోన్ల పట్టణాల్లో భద్రతను కాపాడటానికి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ ఆపరేషన్స్ టీం సభ్యుడు ఇంజనీర్ ముహమ్మద్ అల్-జలావి ప్రకటించారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన 14 ఆస్తుల భవనానికి విద్యుత్తును నిలిపివేసినట్లు వెల్లడించారు. మరో 34 భవనాల యజమానులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ప్రైవేట్ ప్రాంతాల్లో బ్యాచిలర్ హౌసింగ్‌ను నిశితంగా పర్యవేక్షించడానికి ప్రత్యేక ఫీల్డ్ బృందాలను నియమించినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం
- కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!
- యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!
- ‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!
- ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులు అరెస్టు..!!
- ‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!
- కొత్త స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!
- లోక్‌సభలో పలు బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్‌లో కొత్త AI సెంటర్‌తో 3,000 ఉద్యోగాలు..







