ఖతార్ ఎయిర్‌వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!

- December 08, 2025 , by Maagulf
ఖతార్ ఎయిర్‌వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!

దోహా: ఖతార్ ఎయిర్‌వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా హమద్ అలీ అల్-ఖాటర్‌ను నియమించారు.ఆయన నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ఖతార్ ఎయిర్‌వేస్ గ్రూప్ ప్రకటించింది. అల్-ఖాటర్ ఇంజనీర్ బదర్ మొహమ్మద్ అల్-మీర్ స్థానంలో నియమితులయ్యారు. అల్-ఖాటర్ హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఖతార్ ఎయిర్‌వేస్ గ్రూప్‌లో చేరారు. అక్కడ ఆయన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు.

ఇంజనీర్ బదర్ మొహమ్మద్ అల్-మీర్ చేసిన సేవలకు ఖతార్ ఎయిర్‌వేస్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్, హెచ్ ఇ సాద్ షెరిదా అల్-కాబి  కృతజ్ఞతను తెలియజేశారు. హమద్ అలీ అల్-ఖాటర్‌ నియామకాన్ని స్వాగతించారు. ప్రపంచవ్యాప్తంగా ఖతార్ ఎయిర్‌వేస్ సేవలను మరింత విస్తరించనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com