మారుతి తరువాత చిత్రం కొత్త హీరోతోనే

- July 27, 2016 , by Maagulf
మారుతి తరువాత చిత్రం కొత్త హీరోతోనే

ఈరోజుల్లో సినిమాతో చిన్న సినిమాల్లో ఓ కొత్త ఇమేజ్ తెచ్చేలా చేసిన మారుతి ఒక్కో మెట్టు ఎదుగుతూ తన మీద వచ్చిన విమర్శల అడ్డుగోడలన్ని తొలగించుకుని విక్టరీ వెంకటేష్ తో బాబు బంగారం సినిమా తీసే రేంజ్ కు ఎదిగాడు. ఇక ఈ సినిమాతో తానేంటో మరోసారి చూపించేందుకు సిద్ధమైన మారుతి ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి పరిశ్రమ పెద్దలనే ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేసింది.
ఇంతకీ మారుతి తీసుకున్న ఏ డెశిషన్ ఇండస్ట్రీ పెద్దలను సైతం ఆలోచనలో పడేసింది అంటే. తన తర్వాత సినిమా మళ్లీ ఓ కొత్త హీరోతో చేయడమే. ఓ సారి స్టార్ డైరక్టర్ రేంజ్ వచ్చాకా ఆ రేంజ్ ఉన్న హీరోలతోనే వెళ్లాలని ప్రయత్నిస్తారు. కాని మారుతి మాత్రం వెంకటేష్ లాంటి స్టార్ హీరోతో చేసిన తర్వాత ఓ రెండు సినిమాల అనుభవం అది కూడా ఫ్లాప్ సినిమాల హీరోను సెలెక్ట్ చేసుకోవడం అందరిని షాక్ కు గురయ్యేలా చేస్తుంది.
అయితే ఈ సినిమా పట్ల మారుతి రెండు విషయాల్లో కన్విన్స్ అయ్యాడట. రెండు సినిమాల అనుభవమున్న హవీష్ తో సినిమాకు సిద్ధమైన మారుతికి ఆ సినిమా నిర్మాతలు యువి క్రియేషన్స్ వారు ఫ్యాన్సీ అమౌంట్ ఆఫర్ చేశారట. సో ఆ భారీ మొత్తాన్ని కాదనలేక ఈ సినిమా ఒప్పుకున్నాడని అంటున్నారు. ఇక మరో పక్క వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఒకేసారి స్టార్ హీరో సినిమా తీశాక మళ్లీ ఎటువంటి అంచనాలు లేని హీరోతో హిట్ కొట్టి తన సత్తా చాటే ప్రయత్నంలో హవీష్ సినిమాకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.
మరి మారుతి ఏ విధంగా ఈ సినిమాకు సైన్ చేస్తున్నాడో కాని.. ఇది కాస్త తేడా కొడితే ఇన్నాళ్లు తాను ఏదైతే స్టార్ హీరో సినిమాలను డైరెక్ట్ చేయాలని కలగంటున్నాడో ఆ అవకాశం చేజారే అవకాశం ఉంది. మరి మారుతి ఇవన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడంటారా అని అందరు తెగ హడావిడి చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com