ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ

- December 29, 2025 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ

అమరావతి: ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును నియమించటం జరిగింది.ఆయనను ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమించడం జరిగింది.ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారికత పొందింది.

రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉన్న డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు, ప్రభుత్వం తీసుకునే ఆరోగ్య, సహజ చికిత్సా విధానాలపై సలహాలు, మార్గదర్శకత్వం అందిస్తారు. రాష్ట్రంలో ప్రజారోగ్య పరిపాలన, ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ప్రోత్సహించడం ఆయన ముఖ్య బాధ్యతగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

ప్రకృతి వైద్యానికి సంబంధించిన కొత్త పథకాలు, ప్రాజెక్టులు మరియు విధానాలను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర వహిస్తారని, ప్రభుత్వ శాఖలు అందించే సూచనలు, మార్గదర్శకాలతో రాష్ట్రంలో ఆరోగ్య పరిపాలన మరింత సమర్థవంతం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com