‘పెద్ది’ చిత్రంలో ‘అప్పలసూరి’గా జగపతిబాబు

- December 29, 2025 , by Maagulf
‘పెద్ది’ చిత్రంలో ‘అప్పలసూరి’గా జగపతిబాబు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేషనల్ అవార్డు విన్నర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది నుంచి మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో అప్పలసూరి అనే కీలక పాత్రను జగపతిబాబు పోషిస్తున్న ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేసింది.అయితే ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

'పెద్ది’ సినిమాలో అప్పలసూరి పాత్ర కోసం జగపతి బాబు పూర్తిగా తన రూపాన్ని మార్చుకున్నట్లు ఈ ఫస్ట్ లుక్ స్పష్టంగా చెబుతోంది.గడ్డం, రఫ్ లుక్, కళ్లలో కనిపించే ఇంటెన్సిటీతో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది.విడుదల చేసిన పోస్టర్‌లో జగపతిబాబు తనదైన విలక్షణమైన లుక్‌తో ఆకట్టుకుంటున్నారు.ఈ పాత్ర సినిమాకు చాలా కీలకం కానుందని తెలుస్తోంది.ఈ పాన్-ఇండియా చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.ఈ పోస్టర్‌ను రామ్ చరణ్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ ప్రశంసలు కురిపించారు. “స్క్రీన్‌కు అతడు తీసుకొచ్చే ఇంటెన్సిటీ మరెవరి వల్లా సాధ్యం కాదు.జగపతి బాబుని పెద్దిలో అప్పలసూరిగా చూడటం చాలా సంతోషంగా ఉంది” అని ట్వీట్ చేశారు.ఈ సినిమాకు లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించగా, చరణ్ స్టెప్పులు, ఎనర్జీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com