పంటి ఆరోగ్యం కోసం ఇవి తినండి!
- December 29, 2025
పళ్ల ఆరోగ్యం బాగుంటే మొత్తం శరీర ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజువారీ ఆహారంలో సరైన పోషకాలు ఉండటం ఎంతో అవసరం.
పాలు, పెరుగు వంటి పాడి ఉత్పత్తులు దంతాలకు అవసరమైన క్యాల్షియం, ఫాస్ఫరస్‌ను సమృద్ధిగా అందిస్తాయి. ఇవి పళ్ల బలాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు విటమిన్ A, విటమిన్ C, ఫోలేట్‌ను అందించి దంతాల చుట్టూ ఉండే మసూళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఆపిల్, క్యారెట్, నారింజ, మామిడి, ఉసిరికాయ వంటి పండ్లు, చేపలు, గుడ్లు తీసుకోవడం వల్ల పళ్లకు అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందుతాయి.
పంటి ఆరోగ్యం కాపాడుకోవాలంటే అధికంగా తీపి పదార్థాలు, చిప్స్, ఎక్కువ మసాలా కలిగిన ఆహారాన్ని తగ్గించడం మంచిది. ఇవి పళ్లను పాడుచేసే బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







