పుర్రెలతో మెసేజ్ ఇచ్చిన పూరీ

- July 28, 2016 , by Maagulf
పుర్రెలతో  మెసేజ్ ఇచ్చిన పూరీ

తెలుగు ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన పూరీ జగన్నాధ్ హీరో రవితేజతో ఇడియట్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. ఎన్నో విభిన్నమైన కథాంశాలతో అద్భుతమైన దర్శకత్వంతో టాలీవుడ్ లో చాలా మందికి టర్నింగ్ పాయింట్ ఇచ్చిన దర్శకుడు పూరీ జగన్నాధ్. టాలీవుడ్ లో అప్పటి వరకు మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ బాబు కి 'పోకిరి' చిత్రంతో తిరుగులేని విజయాన్ని అందించాడు. హీరోగా సెలిట్ అవ్వడానికి మాస్ మహరాజు రవితేజకు ఇడియట్ చిత్రంతో మంచి బ్రేక్ ఇచ్చాడు. ప్రభాస్ కి 'బుజ్జిగాడు'లాంటి హిట్ ఇచ్చిన పూరీ గత సంవత్సరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి 'టెంపర్ ' చిత్రంతో తనలోని నటుడి విశ్వరూపాన్ని చూపించాడు.ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా చెప్పవొచ్చు. ఇలా పూరీ ఎప్పటికప్పుడు క్రియెటీవ్ గా ఆలోచిస్తూ తన చిత్రంలో కమర్షియల్ తో పాటు మేసెజ్ కూడా అందిస్తుంటారు. సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ స్టార్ హీరోల నోట పలికించి ఎలాంటి ప్రేక్షకులనైనా ఇట్టే ఆకర్షిస్తారు. ఇక సినిమాలోనే కాకుండా సోషల్ మాద్యమాల్లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నారు దర్శకులు పూరి. పూరీ తన ఆలోచనలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూంటాడు. అయితే ఆ పోస్టుల వెనకున్న అర్థాలు సైతం డెప్త్ గా ఉంటాయి. తాజగా పూరి చేసిన పోస్ట్ అందరినీ ఆశ్చర్య పరిచింది. వరుసగా పుర్రెల బొమ్మలు వాటికింద సమాజంలోని పలు మతాలు, కులాలు, వివిధ స్థాయిలు, జెండర్స్ మెన్షన్ చేయబడి ఉన్నాయి.ఇందులో ట్విస్ట్ ఏంటంటే అన్ని పుర్రెలు ఒకే తీరు గా ఉన్నాయి. అయితే కులాలు, మతాలు, ఆడ-మగ, ధనిక-పేద, చివరికి నువ్వు, నేను ఇలా అందరి మధ్యా ఎన్ని తేడాలు, భేదాలు ఉన్నా అంతర్గతంగా అందరి పుర్రెలు ఒకలా ఉంటాయన్న సారాంశం ఎంతో క్రియేటివ్ గా తెలియచెప్పాడు. ఎవరి రక్తం చూసినా ఎరుపు రంగులోనే ఉంటుందన్న విషయాన్ని మరో కోనంలో తెలుపుతూ..చివరగా మనుషులంతా ఒక్కటన్నదే పూరి భావన. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో తెగ హల్ చల్ చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com