బహ్రెయిన్‌లో ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- January 04, 2026
మనామా: బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ఓపెన్ హౌస్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా పలు ఫిర్యాదులకు పరిష్కారం చూపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఓపెన్ హౌస్ లోఎంబసీ కాన్సులర్ మరియు కమ్యూనిటీ వెల్ఫేర్ బృందాలు, న్యాయ నిపుణులు పాల్గొన్నారు.
అలీ అల్దాయిసి హోల్డింగ్‌కు చెందిన 19 మంది కార్మికులతో సహా అనేక మంది భారతీయ పౌరుల విడుదలకు సంబంధించిన కేసులను పరిష్కరించారు. మద్దతుగా నిలిచిన తెలుగు కళా సమితి, తమిళ సామాజిక & సాంస్కృతిక సంఘం (TASCA) మరియు భారతి అసోసియేషన్‌కు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా మదద్ 2.0 ను ప్రారంభించారు. ఆన్లైన్ ఫిర్యాదుల పరిష్కార పోర్టల్ (https://madad.gov.in/) యొక్క ఈ అప్‌గ్రేడ్ వెర్షన్ విదేశాలలో నివసిస్తున్న భారతీయ పౌరులకు మరింత సమర్థవంతమైన సహాయాన్ని అందించడానికి దీనిని రూపొందించారు. ఇంటరాక్టివ్ సెషన్లో అనేక సమస్యలను నేరుగా పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!
- కువైట్ లో జనవరి 18న పబ్లిక్ హాలీడే..!!
- ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకాలపై ఫ్యూయల్‌ఫెస్ట్ హెచ్చరిక..!!
- యూఏఈ స్కూళ్లలో ప్రైడే పని వేళల్లో మార్పులు..!!
- సౌదీలో ఒకే నెలలో 123 కవర్-అప్ కేసులు నమోదు..!!
- 2025లో 2.3% పెరిగిన ఖతార్ జనాభా..!!
- ఒమన్‌లో సోదరి మరణంపై గాయని చిత్ర సంతాపం..!!
- అబుదాబి కారు ప్రమాదం..మరో చిన్నారి మృతి..!!







