భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విమానం ట్రయల్ రన్ సక్సెస్
- January 04, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (AP) లోని, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విమానం ట్రయల్ రన్ సక్సెస్ అయింది.ఢిల్లీ నుంచి భోగాపురంకు తొలి విమానం చేరుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఏటీసీ చైర్మన్ తదితరులు దిగారు. వారికి స్థానిక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ 26న విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు జీఎంఆర్ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది.
అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. మరో 4-5 నెలల్లో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తాం.విశాఖ ఎకనమిక్ రీజియన్‌కు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సందర్శకులను అబ్బురపరుస్తున్న మస్కట్ నైట్స్..!!
- కువైట్ లో 45 మంది డ్రైవర్లకు జైలు శిక్ష..!!
- బహ్రెయిన్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఇండోనేషియాలో జెట్ స్కీ ప్రమాదంలో సౌదీ సిటిజన్ మృతి..!!
- మెట్రాష్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..!!
- జుమేరా బీచ్1 విస్తరణ 95% పూర్తయింది.. షేక్ హమ్దాన్
- ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!
- కువైట్ లో జనవరి 18న పబ్లిక్ హాలీడే..!!







