అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్ సేవలు
- January 04, 2026
న్యూ ఢిల్లీ: భారతదేశంలో ఈ-పాస్‌పోర్ట్ సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇది ఎలక్ట్రానిక్ పరికరం ఆధారంగా పనిచేస్తుంది, దీని బ్యాక్ కవర్ లోని చిప్‌లో పాస్‌పోర్ట్ దారుడి బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి.ఈ-పాస్‌పోర్ట్ ద్వారా విమానాశ్రయాలలో స్కానింగ్, తనిఖీ ప్రక్రియ వేగవంతం అవుతుంది. 36 పేజీల బుక్‌లెట్‌కు రూ.1,500, 60 పేజీల బుక్‌లెట్‌కు రూ.2,000 రుసుము చెల్లించాలి. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు, రెన్యువల్ చేసుకునేవారు కూడా ఈ-పాస్‌పోర్ట్ పొందవచ్చు. ప్రస్తుతం కొన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఈ సేవను త్వరలో మరిన్ని కేంద్రాలకు విస్తరించనున్నారు.
ఇది కూడా సాధారణ పాస్‌పోర్ట్ లాంటిదే. అయితే, ఇది ఎలక్ట్రానిక్ డివైజ్ ఆధారంగా పని చేస్తుంది. ఈ పాస్‌పోర్ట్ బ్యాక్ కవర్లో ఒక చిప్ ఉంటుంది.ఈ చిప్ లో పాస్‌పోర్ట్ దారుడి బయోమెట్రిక్ వివరాలు.. అంటే ఫింగర్ ప్రింట్స్, ఫేసియల్ రికగ్నిషన్, డిజిటల్ సైన్ వంటివి ఉంటాయి. పైగా ఈ చిప్ ను ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. ఎయిర్ పోర్టుల్లో సాధారణంగా పాస్‌పోర్ట్ బుక్ ను పరిశీలిస్తారు. అందులో ఫొటో, సంతకం వంటివి సిబ్బంది తనిఖీ చేస్తారు.
వాటిని సరిచూసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే, ఈ-పాస్‌పోర్ట్ ద్వారా అలా స్కాన్ చేయగానే పూర్తి వివరాలు డిజిటల్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి. దీంతో స్కానింగ్ చేయడం సులభమవుతుంది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ఈ-పాస్‌పోర్ట్ డాక్యుమెంట్ వెనుక భాగంలో ఒక గోల్డ్ కలర్ సింబల్ ఉంటుంది. దీని ద్వారా ఇది చిప్ ఎనేబుల్డ్ పాస్‌పోర్ట్ అని గుర్తించవచ్చు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక
- సందర్శకులను అబ్బురపరుస్తున్న మస్కట్ నైట్స్..!!
- కువైట్ లో 45 మంది డ్రైవర్లకు జైలు శిక్ష..!!
- బహ్రెయిన్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఇండోనేషియాలో జెట్ స్కీ ప్రమాదంలో సౌదీ సిటిజన్ మృతి..!!
- మెట్రాష్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..!!
- జుమేరా బీచ్1 విస్తరణ 95% పూర్తయింది.. షేక్ హమ్దాన్
- ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!







