'మాయావన్‌' చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైంది

- July 28, 2016 , by Maagulf
'మాయావన్‌' చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైంది

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా రూపుదిద్దుకుంటున్న 'మాయావన్‌' చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైంది. హీరో సందీప్‌ కిషన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫస్ట్‌లుక్‌ చాలా ఆసక్తికరంగా ఉంది.ఆగస్టు 2న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నారు. సి.వి. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తిరుకుమరన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. గిబ్రన్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జాకీ ష్రాఫ్‌, డేనియల్‌ బాలాజీ, జయప్రకాశ్‌, భగవతి పెరుమాల్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్‌ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com