అల్లంతో ఆరోగ్యం

- July 20, 2015 , by Maagulf
అల్లంతో ఆరోగ్యం

అల్లం ఆరోగ్యానికి సహజ ఔషధకారి. దీన్ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా దీని జాతికి చెందిన సొంఠిని బాలింతలకు ప్రత్యేకించి పత్యంగా పెడతారు. సొంఠి బాలింతలప్పుడు వచ్చే అనేక గర్భాశయ సమస్యలను హరిస్తుంది. అంతేకాదు గర్భవతుల్లో సాధారణంగా వచ్చే వికారాలు, వాంతులకు కొద్దిగా అల్లం రసానికి , కొంచెం తేనె కలిపి తాగితే వికారం తగ్గుతుంది. దగ్గుతో బాధపడేవారు పాలల్లో చిన్న అల్లం ముక్క వేసి మరిగించి, ఆ పాలను తాగితే ఉపశమనం కలుగుతుంది. హృద్రోగ బాధితులు అల్లాన్ని ,ఉప్పు నీటిలో నానబెట్టి ఆ నీళ్లు రోజూ తాగితే మంచిది. ఆకలి మందగించడం అనేది సాధారణంగా పిల్లల్లోనూ, పెద్దల్లోనూ పెద్దల్లోనూ కూడా సమస్యగా ఉంటుంది. ఈ సమస్యను అల్లంతో అధిగమించవచ్చు. భోజనానికి అరగంట ముందు, కొద్దిగా అల్లం రసాన్ని, తేనె కలిపి తీసుకుంటే ఆకలి పుడుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com