7 నెలలు జీతాల్లేక రోడ్డెక్కిన కార్మికులు

- July 30, 2016 , by Maagulf
7 నెలలు జీతాల్లేక రోడ్డెక్కిన కార్మికులు

ఏడు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ వందలాదిమంది కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలతో నార్తరన్‌ జెడ్డాలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి, అలాగే ఓ గ్యాస్‌ స్టేషన్‌ మూసివేయాల్సి వచ్చింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామనీ, తమ పరిధిలో ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నామని మక్కా రీజియన్‌ పోలీస్‌ అధికార ప్రతినిథి కల్నల్‌ అత్తి అల్‌ ఖురాషి చెప్పారు. మినిస్ట్రీ అధికార ప్రతినిథి ఖలెద్‌ అబా అల్‌ ఖలీల్‌ మాట్లాడుతూ, జీతాలు చెల్లించకపోవడంతో సమస్య ఏర్పడిందనీ, పరిస్థితిని చక్కదిద్దడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోందని వివరించారు. ఇప్పటికే ఆ సంస్థకు పలుమార్లు నోటీసులు అందించామని, వేజ్‌ ప్రొటెక్షన్‌ చట్టం ప్రకారం వ్యవహరించాల్సిందిగా కంపెనీపై ఒత్తిడి తీసుకొస్తున్నామని అన్నారు. నిబంధనల్ని అతిక్రమించినందుకుగాను ఆ సంస్థలపై ఫైన్‌ మరియు పెనాల్టీ విధించడం జరుగుతుందని మినిస్ట్రీ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com