నిర్మాతలు సుబ్రహ్మణ్యం & సుమంత్ తో మాగల్ఫ్ ముఖాముఖీ

- February 23, 2026 , by Maagulf
నిర్మాతలు సుబ్రహ్మణ్యం & సుమంత్ తో మాగల్ఫ్ ముఖాముఖీ

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్‌ 'విష్ణు విన్యాసం'తో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన సారిక హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.ఈ సందర్భంగా నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు.జి, సుమంత్ నాయుడు.జి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.  

'విష్ణు విన్యాసం' అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ కదా.. మీరు విన్న కథ స్క్రీన్  పైకి ఎంత వరకు ట్రాన్స్ఫర్ అయ్యింది?
-కామెడీ కథలు ఎప్పుడు కూడా విన్నప్పుడు కంటే స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాతనే కథలో ఉన్న వినోదం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. మా వరకు ఈ కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో చూసినప్పుడు కూడా అంతే అంతకుమించి ఆస్వాదించాము. సినిమా చాలా బాగా వచ్చింది.విష్ణు చాలా డైలాగ్స్ ని స్పాట్ లో ఇంప్రవైజ్ చేస్తుంటారు. అవన్నీ కూడా ఇందులో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.  ఫైనల్ కాపీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము అనుకున్నది స్క్రీన్ మీద అద్భుతంగా కన్వే అయింది.  

హీరో శ్రీ విష్ణు సపోర్టు గురించి?
-హీరో శ్రీ చాలా సపోర్ట్ చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు సినిమాలు ఒకేసారి రావలసిన పరిస్థితి వచ్చింది. అయితే వన్ వీక్ గ్యాప్ లో ముందుగా కామెడీ ఎంటర్టైనర్ ని తీసుకొచ్చి ఆ తర్వాత థ్రిల్లర్ జానర్ సినిమా తీసుకురావాలని సన్నాహాలు చేశారు. ఈ విషయంలో ఆయన సపోర్టు మర్చిపోలేము. రెండు డిఫరెంట్ జానర్ సినిమాలు కావడంతో ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు.

'విష్ణు విన్యాసం' ఎలా ఉండబోతుంది?
-ఇది హీరో క్యారెక్టర్ మీద నడిచే కథ. దానితో పాటు మరో ఇంట్రెస్టింగ్ ట్రాక్ ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హీరో క్యారెక్టర్ కి న్యూమరాలజీ అంటే నమ్మకం. ఆ క్యారెక్టర్ అధ్యంతం అలరించేలా ఉంటుంది. అలాగే హీరోయిన్ ట్రాక్, రెండు ఫ్యామిలీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.  

టైటిల్ గురించి?
-ఇందులో కథతో పాటు ట్రావెల్ అయ్యే కామెడీ ఎక్కువగా ఉంటుంది. విష్ణు గారి సింగిల్ సినిమా చూసుకుంటే వన్ లైనర్స్, కామెడీ మీద వెళ్తుంటుంది. కానీ ఇందులో మాత్రం మంచి క్యారెక్టర్, అలాగే ఫ్యామిలీ వినోదం అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. ముఖ్యంగా విష్ణు గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో హీరో గారి పేరు విష్ణు. అందుకే సినిమాకి విష్ణు విన్యాసం అని టైటిల్ పెట్టాం.

నయన సారిక గురించి?
-సారిక చాలా మంచి పెర్ఫార్మర్. ఇందులో తన క్యారెక్టర్ తను అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ క్యారెక్టర్ కు తను పర్ఫెక్ట్ యాప్ట్.  

ఫైనల్ ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత మీ రియాక్షన్?
-సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కథపరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా సినిమా ఆడియన్స్ ఖచ్చితంగా అలరిస్తుంది.

రధన్ మ్యూజిక్ గురించి?  
-సినిమా ప్రీ ప్రొడక్షన్ లోనే మేము పాటలన్నీ చేసుకున్నాం. చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మ్యూజిక్ విషయంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాం.రామజోగయ్య సింగిల్ కార్డ్ రాసారు.

నిర్మాతలుగా మీ జర్నీ గురించి?
-రెండు సినిమాలు చేశాం.హరోం హర మాకు కొత్త ఎక్స్పీరియన్స్. ఆ సినిమా టెక్నికల్ వాల్యూస్ లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత జనాలకి ఏం కావాలో  తెలుసుకున్నాం. విష్ణు గారికి ఎలాంటి కథ అయితే బావుంటుందో అది విష్ణు విన్యాసంలో చూస్తారు.  ఈ సినిమా ఇచ్చే సాటిస్ఫాక్షన్ తో మరో రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆడియన్స్ కి రిలేట్ అయ్యే కథలు చేయడంపై దృష్టి పెట్టాం.

-విష్ణు విన్యాసం మంచి కామెడీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ యూత్, సెకండ్ హాఫ్ యూత్ ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు. డెఫినెట్ గా ఆడియన్స్ కి మంచి ఎంటర్టైనర్ చూసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది.

థియేటర్స్ కి ఆడియన్స్ రావడం తగ్గింది కదా..ఒక నిర్మాతరగా మీ అబ్జర్వేషన్ ఏంటి?
-ఒక మంచి సినిమా ఇస్తే ఆడియన్స్ కచ్చితంగా థియేటర్స్ కి వస్తారని నేను నమ్ముతాను. సంక్రాంతి తర్వాత సినిమాలు కూడా తక్కువగా రావడం జరిగింది.మా విష్ణు విన్యాసం సినిమాకి ఖచ్చితంగా ఆడియన్స్ ధియేటర్స్ వస్తారని నమ్మకం ఉంది. సినిమా చూసిన ఆడియన్స్ ఒక చిరునవ్వుతో థియేటర్స్ నుంచి బయటికి వస్తారు.

-విష్ణు విన్యాసం శ్రీ విష్ణు కెరియర్ లో టాప్ ఫైవ్ సినిమాలో ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమాతో ఆయన సక్సెస్ ట్రాక్ కొనసాగుతుంది. శ్రీ విష్ణు తో భవిష్యత్తులో కూడా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.

సుమంత్..ఒక ఆడియన్ గా మీరు ఎవరి సినిమాలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు?
-నేను ప్రభాస్ కి ఫ్యాన్ ని. ఆయన సినిమాలు థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేస్తాను.

సుమంత్..మీకు నిర్మాణంతో పాటు నటనపై ఆసక్తి ఉందా?
-ప్రస్తుతం నా దృష్టి నిర్మాణంపైనే ఉంది. నేను చేసే సినిమాలు నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తే నటన గురించి ఆలోచిస్తాను.నటన పై కూడా నాకు ఆసక్తి ఉంది.నాకు లవ్ స్టోరీలు, రొమాంటిక్ కామెడీలు అంటే ఇష్టం.  

విష్ణు విన్యాసం ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతుంది?
-ఇది మంచి కామెడీ ఎంటర్టైనర్.కామెడీ పక్కాగా ఎంజాయ్ చేస్తారు.ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు.ఫస్ట్ హాఫ్ యూత్ కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ యూత్, ఫ్యామిలీని ఇద్దరినీ అలరిస్తుంది. అలాగే ఇందులో చాలా మంచి మ్యూజిక్ ఉంది. రిలీజ్ అయిన తర్వాత కొన్ని సాంగ్స్ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతాయి.  

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
-ఒక రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ నడుస్తున్నాయి.త్వరలోనే అనౌన్స్ చేస్తాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com